విశాఖ స్టేడియం వద్ద అదుపుతప్పిన వాహనం
విశాఖ స్టేడియం సిగ్నల్ వద్ద పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ కుమార్ వెంటనే స్పందించి జేసీబీతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.