నేడు ఎంపీడీవో కార్యాలయానికి హాజరుకండి

SKLM: నరసన్నపేట మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించామని ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు తెలిపారు. గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేస్తూ దరఖాస్తుదారులు నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు. దీనిపై సంబంధిత బ్యాంక్ అధికారులతో పాటు తదితరులు దరఖాస్తులను పరిశీలిస్తారని ఆయన స్పష్టం చేశారు.