రూ.1 ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన ఫ్రీడమ్ ప్లాన్‌ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ సేవలను పొందవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు సమీపంలోని BSNL సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.