ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి

ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి

ASR: అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు, సిబ్బంది, వైసీపీ నాయకులు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బిర్సా ముండా పోరాటాలు, త్యాగాల గురించి ఎంపీడీవో వివరించారు. బస్కి సర్పంచ్ రమేష్, వైసీపీ నాయకులు అశోక్, ఏవో ఉదయ భాస్కర్, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.