'భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి'
GDWL: భూభారతి, సాదాబైనామా వంటి భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 6,391 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.