'భవనం కడితే చాలు వాలిపోతున్నారు'

HYD: జీహెచ్ఎంసీ-14 సర్కిల్లోని కొందరు సిబ్బంది అవినీతి, అక్రమాలకు అలవాటు పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు రాకేశ్ జైస్వాల్, శంకర్ యాదవ్, లాల్‌సింగ్, దర్శన్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరైనా భవనం కడితే చాలు అక్కడికి వెళ్లి యజమానిని బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు.