రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

NLR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ ఆర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.