ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

HYD: మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు చేశారు.