కొలిమిగుండ్లలో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
NDL: కొలిమిగుండ్ల కొండపై వెలసిన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ పనుల కారణంగా ఎనిమిదేళ్లుగా ఆగిపోయిన ఈ ఉత్సవాలను ఈ ఏడాది నిర్వహించాలని ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఏప్రిల్ 29 నుంచి మే 9 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇవాళ తెలిపారు.