జిల్లాలో పెరుగుతున్న 'స్క్రబ్ టైఫస్' కేసులు
VSP: విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం సృష్టిస్తుంది. రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులను వైద్యులు నిర్ధారించారు. KGHలో ఈ నెలలోనే 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, 'స్క్రబ్ టైఫస్' అంటువ్యాధి కాదని KGH సూపరింటెండెంట్ అన్నారు. ఈ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుచించారు.