క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్

NRPT: ఈనెల 1న హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఛాంపియన్షిప్‌లో బాలమని 49 కేజీల కేటగిరీలో, శివరంజని 73 కేజీల కేటగిరిలో గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ సన్మానించి అభినందించారు.