మున్సిపల్ సిబ్బందికి యోగా శిక్షణ
MDK: రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని హోమియోపతి, యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా హోమియోపతి పితామహుడు డాక్టర్ హెనెన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయుష్ యోగా శిక్షకులు మద్దెల భరత్ కౌన్సిలర్లు, అధికారులకు యోగాసనాలు, ప్రాణాయామంపై శిక్షణ ఇచ్చారు.