దేవరకద్ర ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్, లాల్ కోట, భూత్పూర్ మండలం తాడిపర్తి, పెద్ద తండా, కప్పేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అడ్డాకుల మండలంలోని గౌరీదేవి పల్లి, రామచంద్రపురం గ్రామాలలో పర్యటిస్తారన్నారు.