సదరం క్యాంపు షెడ్యూల్ ప్రకటించిన జిల్లా అధికారులు

VKB: జిల్లాలో సదరం క్యాంపు షెడ్యూల్ విడుదలైంది. జూన్ మాసానికి సంబంధించిన క్యాంపుల వివరాలను ప్రకటించారు. వికలాంగత్వంకు 350, వినికిడిలోపంకు 60, కంటిచూపుకు 60, మానసిక వికలాంగత్వానికి సంబంధించి 120 స్లాట్ల బుకింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 590 స్లాట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 6వ తేది నుంచి సదరం క్యాంపులు ప్రారంభం.