VIDEO: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

BDK: భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి 37.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం నదిలోకి 6,72,143 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.