VIDEO: జి కొత్తూరులో వెలగని విద్యుత్ దీపాలు
NTR: తిరువూరు మండలం జి. కొత్తూరు ఎస్సీకాలనీలో మూడు రోజులు నుంచి విద్యుత్ వీధి దీపాలు వెలగకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నామని స్థానికులు వాపోయారు. సాయంత్రం అయితే చాలు చిన్న పిల్లలు, పెద్దలు పాములు, కుక్కలు భయంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.