బైరెడ్డిపల్లిలో ఈ నెల 12న వాహనాల వేలం

బైరెడ్డిపల్లిలో ఈ నెల 12న వాహనాల వేలం

CTR: ఈ నెల 12న బైరెడ్డిపల్లి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం వేయనున్నట్లు సీఐ పరశురాముడు తెలిపారు. ఇందులో భాగంగా స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డ 12 వాహనాలను గంగవరం పోలీస్ స్టేషన్‌లో వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఉదయం గంగవరం పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.