ముక్కామలలో మొక్కల పెంపకం కార్యక్రమం

GNTR: తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పిలుపు మేరకు, గుంటూరు జిల్లా ముక్కామల గ్రామంలో టీడీపీ నాయకులు శుక్రవారం పర్యావరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ నీలాల కృష్ణారావు, గ్రామ టీడీపీ నాయకులు మొక్కలు నాటారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.