కోల్ ఇండియా పోటీలకు సింగరేణి కళాకారులు
PDPL: సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలు సీఈఆర్ క్లబ్లో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆర్జీ 1, 2 కళాకారులు ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ధార సుశీల, ఆదిల్ మహమ్మద్, సాన జలపతి, పుల్యాల సతీశ్, పొన్నాల శంకర్, శ్యాం, కనకం రమణయ్య, రాకేశ్, బోయిని రాజారాం, పులిపాక ప్రేమ్ కుమార్ ఉన్నారు. వీరిని అభినందించారు.