కూరగాయల సాగుతో అధిక లాభాలు: జిల్లా అధికారి

MHBD: కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. సోమవారం నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూరగాయల తోటలను ఆయన పరిశీలించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఆయన వివరించారు.