బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
MBNR: బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం వీధి కుక్కలు దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇవాళ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా బాధితుడికి రూ.25 వేల నగదును అందజేశారు. ఈ మేరకు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.