ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

VSP: విశాఖపట్నంలోని శ్రీ కృష్ణ చైతన్య మఠంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా గురువారం నిర్వహించిన ఆనంద మేళాలో రూపా డాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు తమ నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కూచిపూడి నృత్యాలతో పాటు కుండ, బిందె, హారతి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.