దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ జడ్పీటీసీ

ADB: భారీ వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు, పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా కృషి చేస్తానని తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పేర్కొన్నారు. నేడు తలమడుగు మండలంలో డోర్లి, రూయ్యడిలో భారీ వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను, పంటలను పరిశీలించారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ సభ్యులు బొల్లారపు బాబన్న, సుంకిడి మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, తదితరులు ఉన్నారు.