రేషన్ షాపులలో ఆకస్మిక తనిఖీ
NRPT: మక్తల్ పట్టణంలోని రేషన్ షాపులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడు నెలల బియ్యం పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు కల్పిస్తున్న మంచినీటి సౌకర్యాలను డీఎం సైదులు, డీఎస్ఓ బాలరాజు పరిశీలించారు. పంపిణీ తీరుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.