సంపరలో జనసేన కార్యాలయం ప్రారంభం
కాకినాడ: పెదపూడి మండలం సంపర గ్రామంలో నిర్మించిన జనసేన కార్యాలయాన్ని శనివారం అనపర్తి ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కన్వీనర్ నాగిరెడ్డి వీరాస్వామి, జోనల్ కన్వీనర్ ఆర్.నాగు, శ్రీనివాసరావుకు వేద పండితులు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.