డిగ్రీ పరీక్షలను పర్యవేక్షించిన టీయూ అధికారులు
KMR: పట్టణ కేంద్రంలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను శనివారం తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ డా.అతిక్ సుల్తాన్ ఘోరీ పరిశీలించారు. ఇన్విజిలేటర్లు సక్రమంగా విధులు నిర్వహించేటట్లు అబ్జర్వర్లు సూచించాలన్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.