భాగస్వామ్య పింఛన్లు పంపిణీ

ELR: నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో శుక్రవారం సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కొన్నంగుంట, బోర్వంచ, కొత్తూరు గ్రామాలకు భాగస్వామ్య (స్పౌజ్) లబ్ధిదారులకు 8 పింఛన్లు మంజూరయ్యాయి. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు పామర్తి వేణుగోపాలరావు, చెన్నారావు, వెంకట శ్రీహరి, నక్క ముసలయ్య పాల్గొన్నారు.