అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: చంద్రగిరి నియోజకవర్గంలో రూ.2.52 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభోత్సవం చేశారు. రూరల్ మండలంలోని పాడిపేట పంచాయతీలో సీసీ రోడ్డు, ప్రభుత్వ వ్యాయామశాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే తెలియజేశారు.