రేపు పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం

SKLM: రణస్థలం సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని AE తిరుపతిరావు గురువారం వెల్లడించారు. జె ఆర్. పురం, రణస్థలం, రావాడ, కొండములగాం, కమ్మసిగడాం, వెల్పురాయి, దేవరపల్లి, అర్జునవలస, ఎం. నగరపాలెం, తిరుపతిపాలెం, పున్నానపాలెం, సంచాం గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామని పేర్కొన్నారు.