వైరా వాగు పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం

TG: ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. వైరా వాగుపై నిర్మించే రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్, వంతెన పనులను పరిశీలించి, ఆరా తీశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.