సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
NGKL: చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన జమ్ముల తిరుపతయ్య కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.44,000 ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య యాదవ్ బుధవారం అందజేశారు. నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.