VIDEO: గుండుమాల్‌లో ఫాగింగ్ ముమ్మరం
NRPT: గుండుమాల్ మండలంలోని అన్ని వార్డుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ శ్రీశైల నర్సిములు యాదవ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వేసవిలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పైలెట్ ప్రాజెక్టుగా గ్రామమంతటా విస్తృతంగా ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ లక్ష్యమని, ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.