'జిల్లాలో కార్తీక మాస వన మహోత్సవాలు నిర్వహిస్తున్నాం'
KRNL: పత్తికొండలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవాలను ఇవాళ నిర్వహించనున్నట్లు సీపీఐ సీనియర్ నాయకులు భీమ లింగప్ప, సురేంద్ర కుమార్ శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగ నిపుణులు రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వన మహోత్సవాన్ని ఆయన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.