భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

VKB: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు.