పూండిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురంలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటినా నేపథ్యంలో వర్షం తీవ్రత బాగా పెరిగిపోయింది. ఈరోజు జిల్లాలో స్కూల్స్, కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో విద్యార్థులు వర్షం, గాలుల మధ్య కళాశాలకు, పాఠశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.