ఈనెల 6న ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభ

WGL: గద్దర్ గళం అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభను ఈనెల 6న నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రొ.ఐలయ్య, ప్రొ.కూరపాటి నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గద్దర్ గళం ఫౌండర్ ఛైర్మన్ సత్తయ్య, వివిధ రంగాల మేధావులు, తదితరులు హాజరవుతున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.