నేడే మెగా డీఎస్సీ మెరిట్ జాబితా

AP: మెగా డీఎస్సీ మెరిట్ జాబితా ఇవాళ విడుదల కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే ఉంచుతామని.. అభ్యర్థులు ఈ వెబ్ సైట్ల నుంచి సమాచారం పొందాలని సూచించారు. 'జోన్ ఆఫ్ కన్సిడరేషన్'లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామన్నారు.