కొమురవెల్లి హుండీ ఆదాయం లెక్కింపు

SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి కొమురవెల్లిలోని ఆలయ ముఖమండపంలో ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో దేవాలయ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు.15 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం రూ. 69లక్షల 11వేల 633 వచ్చింది. మొత్తం డబ్బులను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.