'పెండింగ్లో ఉన్న కమిషన్లు వెంటనే చెల్లించాలి'

BDK: ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న కమీషన్లు వెంటనే చెల్లించాలని అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. సకాలంలో కమిషన్లు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ మణిధర్‌కు రేషన్ డీలర్లు వినతి పత్రం అందజేశారు.