చెరువును పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకు వినతి

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 284లో 9 ఎకరాల 30 గుంటలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కొందరు నాయకులు చెరువులు ధ్వంసం చేసి, ప్లాట్లు చేసి అమ్మిన విషయం తెలిసిందే. అధికారులు ఇటీవలే సర్వే చేసి ప్లాట్ల రాళ్లను తొలగించారు. ఈరోజు గ్రామస్థులు నాగులకుంట చెరువును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.