ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుల ఆగ్రహం..!
VKB: బంట్వారం మండలం తోర్మామిడి వయా బంట్వారం నుంచి ఉదయం 5:40కు హైదరాబాద్ వెళ్లే వికారాబాద్ డిపో బస్సు (TG3420062) డ్రైవర్ భీమారావు బస్టాప్‌లలో బస్సు ఆపడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపమంటే వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వికారాబాద్ డిపో మేనేజర్ స్పందించి డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.