ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
విజయనగరంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.