వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

SKLM: వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ముస్లిం జేఏసీ నేతలు, వివిధ పౌర సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గురువారం జాతీయ జెండాతో నగరంలోని డైమాండ్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముస్లింల మేలు కోసమే వక్ఫ్ సవరణ చట్టమని చెబుతున్న ఎన్డీఏ ప్రభుత్వం వారి అణిచివేతకు కారణమవుతోందన్నారు.