'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.