నెల్లూరు మాజీ మేయర్ అవినీతిపై విచారణ
NLR: కార్పొరేషన్ మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి అవినీతి ఆరోపణపై ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ విచారణకు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగి నుంచి రూ.65,000 ఫోన్ పే చేయించుకున్నారని విమర్శలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు.