'ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలి'

'ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలి'

ADB: ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషకాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆదిలాబాద్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.