'కాఫీ రైతులకు న్యాయం చేయాలి'

ASR: బెర్రీ బోరర్ కీటకంతో తీవ్ర నష్టం చెందిన కాఫీ తోటలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. డుంబ్రిగూడ, అరకువేలి మండలాల్లో రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత నష్టపరిహారం రూ.20 వేలుగా కాకుండా, కనీసం రూ.1 లక్ష ఇవ్వాలని, కాఫీకి మద్దతు ధర కేజీకి రూ.100గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.