NLR: రూ.లక్ష సాయం చేసిన ఉదయగిరి మాజీ MLAలు
NLR: వింజమూరు(M) గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు కర్నూలు బస్సు దుర్ఘటనలో సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యుల నివాసానికి గురువారం వెళ్లి పరామర్శించారు. అనంతరం రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.