బుగ్గ రామలింగేశ్వర ఆలయం మూసివేత
ATP: మార్చి 3న కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. మంగళవారం ఉ.6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. గ్రహణం మ.3:19 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 6:46 నిమిషాలకు ముగుస్తుంది. తిరిగి మార్చి 4న ఉ.6 గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.