వైసీపీలో చేరిన 50 మంది యువకులు

విజయనగరం జిల్లా: గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి చెందిన 50 మంది యువకులు మంగళవారం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సమక్షంలో తన నివాసంలో వైసీపీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ విజయానికి అందరూ కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, యువ నేత బొత్స సాయి గురునాయుడు, జడ్పిటిసి గార తౌడు, మండల సురేష్, రేగ సురేష్ పాల్గొన్నారు.